లెక్క తేల్చి అవార్డ్ పట్టిన అమెరికన్ ఇండియన్

లెక్క తేల్చి అవార్డ్ పట్టిన అమెరికన్ ఇండియన్
  • నిఖిల్ శ్రీవాస్తవకు సిప్రియాన్ ఫోయాస్ అవార్డు
  • ఆపరేటర్ థీరీలో 1959 నాటి ప్రాబ్లమ్​ను సాల్వ్ చేసిన మ్యాథ్స్ జీనియస్ 

వాషింగ్టన్: ప్రముఖ ఇండియన్ అమెరికన్ మ్యాథమెటీషియన్, ప్రొఫెసర్ నిఖిల్ శ్రీవాస్తవకు అమెరికన్ మ్యాథమెటికల్ సొసైటీ (ఏఎంఎస్) నుంచి 2021 ఏడాదికి ‘సిప్రియాన్ ఫోయాస్ ప్రైజ్’ లభించింది. మ్యాథ్స్ లో ఆపరేటర్ థీరీకి సంబంధించి 1959 నుంచి ఎవరూ పరిష్కరించలేకపోయిన ఓ ప్రాబ్లమ్​ను సాల్వ్ చేసినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. వచ్చే ఏడాది జనవరి 5న సియాటెల్​లో జరిగే ‘2022 జాయింట్ మ్యాథమెటిక్స్ మీటింగ్’లో మరో ఇద్దరు విజేతలతో కలిసి నిఖిల్ ఈ అవార్డును అందుకోనున్నారు. అవార్డు కింద ఆయనకు రూ.3.76 లక్షలు క్యాష్ ప్రైజ్ అందజేయనున్నారు. రొమేనియన్ – అమెరికన్ మ్యాథమెటీషియన్ సిప్రియాన్ ఇలీ ఫోయాస్ పేరిట ఈ అవార్డును ఏఎంఎస్ ఈ ఏడాదే ప్రారంభించగా, మొదటి అవార్డు నిఖిల్ శ్రీవాస్తవకు దక్కింది.