అమెరికా అధ్యక్ష రేస్ నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి

అమెరికా అధ్యక్ష పదవి రేస్ నుంచి ఇండో అమెరికన్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి తప్పుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయోవా కాకస్‌లలో రికార్డు స్థాయిలో విజయం సాధించడంతో వివేక్ రామస్సవామి ఈ నిర్ణయం తీసుకన్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేయాలని భావించిన రామస్వామి అందుకోసం ప్రచారం కూడా చేశారు.

 కానీ ఆశించిన స్థాయిలో మద్దతు రాకపోవడంతో వెనక్కి తగ్గారు. డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి తాను మద్దతు పలుకుతున్నట్లు ఆయన ప్రకటించారు. 2024 అమెరికా అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు తెలిపారు. 
ఐఓవా కాకస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా రామస్వామి ఫ్రాడ్ అని ట్రంప్ ప్రచారం చేశారు.

 ఆయనకు ఓటేస్తే ప్రత్యర్థి పార్టీకి మేలు చేసినట్లు అవుతుందని అమెరికా మాజీ అధ్యక్షుడు హెచ్చరించారు. దీంతో అక్కడి ప్రజలు ట్రంప్ వైపు మళ్లారు. ఐఎవా కాకస్ ఎన్నికల్లో ట్రంప్ ను గెలిపించారు.  దీంతో అధ్యక్ష ఎన్నిక రేస్ నుంచి తప్పుకున్నారు.  ట్రంప్ కు తాను పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తానని రామ స్వామి చెప్పారు. ఈ క్షణం నుండి, తాము ఈ అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.