ODI World Cup 2023: చెన్నై చేరుకున్న భారత్, ఆసీస్ జట్లు.. తొలి మ్యాచుకు అంతా సిద్ధం

క్రికెట్ లో భారత్, ఆస్ట్రేలియా సమరానికి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. భారత్-పాక్ తర్వాత ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఇరు జట్లు పటిష్టంగా ఉండడమే దీనికి కారణం. ఇదిలా ఉండగా.. ఈ రెండు జట్లు వరల్డ్ కప్ సమరానికి సిద్ధమయ్యాయి. వార్మప్ మ్యాచులు ముగించుకొని ఇరు జట్లు బుధవారం చెన్నై చేరుకున్నారు. అక్టోబర్ 8 న జరగనున్న ఈ మ్యాచుకు చెన్నైలోని చిదంబరం స్టేడియం ఆతిధ్యమివ్వబోతుంది.
       
వరల్డ్ కప్ వార్మప్ మ్యాచుల్లో భాగంగా నెదర్లాండ్స్ తో మ్యాచ్ రద్దు చేసుకున్న ఆసీస్.. పాక్ పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆసీస్ ఆత్మవిశ్వాసంతో ఉంటే.. భారత్ ఆడాల్సిన రెండు మ్యాచులు వర్షం కారణంగా రద్దయ్యాయి. అయితే ఆసీస్ తమ చివరి రెండు సిరీస్ లను దక్షిణాఫ్రికా, భారత్ చేతిలో కోల్పోగా,  భారత్ మాత్రం ఆసియా కప్, ఆస్ట్రేలియాతో సిరీస్ లను గెలిచి మంచి ఊపు మీద కనిపిస్తుంది. అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న మ్యాచులో ఎవరు బోణీ కొడతారో చూడాలి.

ALSO READ : మ్యాన్షన్ 24 ట్రైలర్ రిలీజ్..భయపెట్టే వెబ్ సీరిస్తో వస్తున్న ఓంకార్

కాగా.. ఇరు జట్ల మధ్య చివరి నాలుగు వన్డే వరల్డ్ మ్యాచులని పరిశీలిస్తే సమానంగా ఉన్నాయి. 2019లో భారత్ కంగారూల మీద గెలిస్తే.. 2015 లో సొంత గడ్డపై జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 2011 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొడితే.. 2003 లో వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ జయభేరి మోగించింది.