శ్రీనగర్: ఇండియా, చైనా బార్డర్ తూర్పు లడ్డాఖ్లో ఇరుదేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు మెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ)లో ఇండియా, చైనా సైనికులు సమన్వయ పెట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అగ్రిమెంట్లో భాగంగా.. 2024 నవంబర్ 1న మొదట డెమ్ చోక్లో భారత్, చైనా సైన్యాలు పెట్రోలింగ్ ప్రారంభించాయి. కాగా, 2021లో తూర్పు లడ్డాఖ్లోని గాల్వాన్ లోయ వద్ద భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే.
బార్డర్లో ఇరు దేశాల సైనికులు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో అప్పటి నుండి ఇండియా, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్ఏసీ వెంబటి ఇరు దేశాలు భారీగా సైన్యాన్ని మోహరించాయి. ఇటీవల భారత్, చైనా అధికారులు చర్చలు జరిపి.. ఎల్ఏసీ వెంబటి సాధారణ పరిస్థితులు తీసుకురావాలని ఒప్పందం చేసుకున్నారు. గతంలో మాదిరిగానే తూర్పు లడ్డాఖ్లో సరిహద్దు వెంబటి ఇరు దేశాల సైనిక బలగాలను ఉపసంహరించుకుని.. సమన్వయ పెట్రోలింగ్ చేసుకోవాలని అగ్రిమెంట్ చేసుకున్నాయి.
ALSO READ | పాక్ ఆ సాహసం చేయదు: పండుగ వేళ దాయాది దేశానికి ప్రధాని మోడీ వార్నింగ్
మొదట డెమ్ చోక్, డెస్పాంగ్ పాయింట్లలో సైన్యాన్ని వెనక్కి పిలిపించి పెట్రోలింగ్ చేయాలని ఇరుదేశాల సైనికాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు.. డెమ్ చోక్, డెస్పాంగ్ పాయింట్లలో ఇండియా, చైనా బలగాలను ఉపసంహరణ పూర్తి అయ్యింది. దీంతో డెమ్ చోక్ ఇరు దేశాల సైనికులు సమన్వయ పెట్రోలింగ్ స్టార్ట్ చేశారు. డెస్పాంగ్లో మరో మూడు రోజుల్లో పెట్రోలింగ్ ప్రారంభం అవుతోందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.