తీర ప్రాంతాల్లో ఈ మధ్య భారీగా డ్రగ్స్ పట్టబడుతోంది. ఇటీవలే అండమాన్ తీరంలో కోస్ట్ గార్డ్ ఐదు టన్నుల డ్రగ్స్ ను పట్టుకున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా నవంబర్ 29న అరేబియా మహాసముద్రలో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు ఇండియన్ కోస్ట్ గార్డ్. ఇండియన్ కోస్ట్ గార్డ్, శ్రీలంక కోస్ట్ గార్డ్ కలిసి జరిపిన ఆపరేషన్‌లో అరేబియా సముద్రంలో రెండు పడవలలో సుమారు 500 కిలోల డ్రగ్స్ ( క్రిస్టల్ మెత్) స్వాధీనం చేసుకున్నాయి. రెండు పడవలను సీజ్ చేశారు.
నవంబర్ 25న అండమాన్ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడిన సంగతి తెలిసిందే.. ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది ఫిషింగ్ బోట్ నుంచి ఐదు టన్నుల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. చేపలు వేటాడే పడవ ద్వారా డ్రగ్స్ ను సరఫరా చేస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. కోస్ట్ గార్డ్ చరిత్రలో ఇప్పటివరకు పట్టుకున్న డ్రగ్స్ లో ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు.
Narcotics Seizure - Combined Operation b/n #IndianNavy & @srilanka_navy.
— SpokespersonNavy (@indiannavy) November 29, 2024
Based on information received from #SrilankaNavy regarding probable narcotics smuggling by Sri Lankan flagged fishing vessels, the @indiannavy swiftly responded through a coordinated operation to localise &… pic.twitter.com/dkpzNQonTF