
దేనికైనా.. ఏ క్షణమైనా సిద్ధంగా ఉన్నాం.. ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాం.. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నాం అంటూ ప్రకటించింది ఇండియన్ ఆర్మీ. భయం లేదు.. కనికరం లేదు.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు.. అది ఎలాంటి భూభాగమైనా.. ఎవరి భూభాగమైనా సరే.. ఎంత కఠినంగా ఉన్నా.. మా లక్ష్యాన్ని దూరం కాదు.. కార్యాచరణ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది.. అంటూ వీడియో రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ.
పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత.. పాకిస్తాన్ పై యుద్ధం చేయాలంటూ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవాలంటూ భారతీయుల నుంచి గట్టిగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎన్నాళ్లు ఈ ఉగ్రదాడులు.. ఎన్నాళ్లు భరించాలి.. ఎన్నాళ్లు ఉపేక్షించాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే.. శత్రువులు కలలో కూడా ఊహించని విధంగా విరుచుకుపడతాం అని.. ప్రతికారం కచ్చితంగా ఉంటుందని.. గట్టిగా గుణపాఠం చెబుతామని ప్రధాని మోదీ సైతం వార్నింగ్ ఇచ్చారు.
Also Read:-రక్షణ మంత్రితో.. ఆర్మీ చీఫ్ భేటీ : యుద్ధానికి డేట్, టైం ఫిక్స్ అయ్యిందా..?
దేశం మొత్తం.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు.. అన్ని పార్టీలు యుద్ధానికైనా మద్దతు అంటూ ప్రకటించాయి. ఇప్పటికే పాకిస్తాన్ దేశంతో ఉన్న అన్ని సంబంధాలు కట్ అయ్యాయి. దౌత్య, వాణిజ్య పరంగా తెగదెంపులు జరిగాయి. ఇక మిగిలింది యుద్ధమే.. యుద్ధానికి సిద్ధం అన్న సంకేతాలకు బలం ఇస్తూ.. ఇండియన్ ఆర్మీ విడుదల చేసిన వీడియో ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
దేనికైనా సిద్ధంగా ఉన్నాం అంటూ ఇండియన్ ఆర్మీ నుంచి X వేదికగా వీడియో రిలీజ్ కావటంతో.. ఏ క్షణమైనా పాకిస్తాన్ పై ఇండియా యుద్ధం ప్రకటించే అవకాశాలు లేకపోలేదు.. భారత్ సైన్యం కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన తర్వాత.. ఇక మిగిలింది కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే..
Always Prepared, Ever Vigilant - #IndianArmy pic.twitter.com/NIHWvWF9oM
— ADG PI - INDIAN ARMY (@adgpi) April 26, 2025