Pahalgam Attack:రక్షణ మంత్రితో.. ఆర్మీ చీఫ్ భేటీ : యుద్ధానికి డేట్, టైం ఫిక్స్ అయ్యిందా..?

Pahalgam Attack:రక్షణ మంత్రితో.. ఆర్మీ చీఫ్ భేటీ : యుద్ధానికి డేట్, టైం ఫిక్స్ అయ్యిందా..?

భారత్,పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.భారత్ ,పాక్ లో తాజా పరిమాణాలు చూస్తే దాదాపు యుద్దం ప్రారంభమైనట్టే కనిపిస్తోంది. ఢిల్లీ పరిణామాలు వేగంగా.. చకచకా జరిగిపోతున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత ప్రతికారం తప్పదని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అందరితో చర్చలు వేగంగా జరుగుతున్నాయి. ఆల్ పార్టీ మీటింగ్ లో అన్ని పార్టీలు ఏ చర్య తీసుకున్నా సిద్ధం అని ప్రకటించాయి. 

ఈ క్రమంలోనే.. 2025, ఏప్రిల్ 26వ తేదీ ఉదయం ఇండియన్ ఆర్మీ ఓ వీడియో రిలీజ్ చేసింది. దేనికైనా. ఎప్పుడైనా సిద్ధంగా అని.. ఇదే క్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది.. వీరి భేటీ గంటకుపైగా నడిచింది. దీంతో పాకిస్తాన్ పై ఇండియా యుద్ధానికి సర్వం సిద్ధం చేస్తు్న్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ వీడియో తర్వాత.. వీరి భేటీ జరగటం చూస్తుంటే.. పాక్ పై యుద్ధానికి డేట్, టైం ఫిక్స్ అయ్యిందా.. ఈ విషయంపైనే వీళ్లు చర్చించారా అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Also Read:-యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. చిటికేస్తే చాలు దిగిపోతాం

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కు సింధు జలాలను భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఉగ్రవాదులకు సపోర్టు చేస్తున్న పాకిస్తాన్ సింధు జలాలను నిలిపివేయడంపై అహంకారంతో సవాల్ విసురుతోంది. యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నాం అన్నట్లు వ్యవహరిస్తోంది. మరోవైపు నిన్న జమ్మూకాశ్మీర్ లో పర్యటించిన భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది..ఇవాళ(శనివారంఏప్రిల్ 26) రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. 

మరో వైపు ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య  అన్ని దౌత్య సంబంధాలు తెగిపోయాయి. ఉగ్రదాడికి సంబంధం ఉన్న టెర్రరిస్టులను పాక్ ప్రేరేపించిందని నిర్ధారణకు వచ్చిన భారత్.. ముష్కరులను ప్రోత్సహిస్తున్న పాక్ పై ప్రతీకార చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారత నావీలో అత్యంత శక్తివంతమైన INS విక్రాంత్ ను రంగంలోకి దింపింది. ఐఎన్ ఎస్ విక్రాంత్ పాక్ జలాలవైపు మోహరించింది. ఎల్ వోసీ వెంట కాల్పులకు తెగబడిన పాక్ సైనికుల ను తరమికొట్టింది. మరోవైపు కాశ్మీర్ లో తిష్టవేసిన టెర్రరిస్టుల ఏరివేత భారత్ ఆర్మీ ఏరివేత మొదలు పెట్టింది.. ఈ క్రమంలో తాజాగా శనివారం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది భేటీ కావడంతో దాదాపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని తెలుస్తోంది.