చిట్యాల పంట పొలాల్లో దిగిన ఆర్మీ హెలికాఫ్టర్

ముగ్గురు అధికారులతో వెళుతున్న ఆర్మీకి చెందిన హెలికాఫ్టర్ అత్యవసరంగా పంట పొలాల్లో దిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ హకీంపేట వెళుతూ ఉండగా.. మార్గమధ్యలో సాంకేతిక లోపం తలెత్తింది. హెలికాఫ్టర్ లో సమస్యను గుర్తించిన పైలెట్.. అత్యవసరంగా కిందకు దింపారు. 

చిట్యాల మండలం వనిపాకల గ్రామంలోని వ్యవసాయ పంట పొలాల్లో.. ఆర్మీ హెలికాఫ్టర్ దిగింది. హెలికాఫ్టర్ లో ముగ్గురు ఆర్మీ అధికారులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పొలాల్లో ఆర్మీ హెలికాఫ్టర్ ను చూసి.. పొలం పనులు చేసుకుంటున్న రైతులు మొదట షాక్ అయ్యారు. ఆ తర్వాత విషయం తెలిసి ఊపిరిపీల్చుకున్నారు.

ఎలాంటి ప్రమాదం లేకుండా.. సురక్షితంగా పొలాల్లో దిగటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విజయవాడ నుంచి మూడు హెలికాఫ్టర్లు హకీంపేటకు వెళుతుండగా.. ఓ హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్య రావటంతో.. అత్యవసరంగా దించినట్లు చెబుతున్నారు పైలెట్. హెలికాఫ్టర్ బాగు చేయించటానికి.. సమస్యను పరిశీలించటానికి ఆర్మీకి చెందిన సాంకేతిక నిపుణులు హైదరాబాద్ నుంచి బయలుదేరి.. స్పాట్ కు వెళుతున్నారు.

Also Read :- తెలంగాణలో AI డెవలప్‌మెంట్‌కు 25 అంశాలతో రోడ్ మ్యాప్