దారితప్పిన చైనీయులను కాపాడి ఇండియన్ ఆర్మీ మానవత్వాన్ని చాటుకుంది. నార్త్ సిక్కింలోని ప్లాటీవ్ రియాలో పర్వత ప్రాంతంలో 17,500 అడుగుల ఎత్తులో ముగ్గురు ఇబ్బంది పడుతుండటంతో రక్షించింది. సెప్టెంబర్ 3న ఈ ఘటన జరిగింది. జీరో కన్నా తక్కువ టెంపరేచర్ల ఉండటంతో వారికి ఆక్సిజన్, ఆహారం, స్వెట్లర్లు అందజేసినట్టు ఆర్మీ తెలిపింది. తిరిగి వారు సురక్షితంగా ఇండ్లకు చేరేందుకు అవసరమైన గైడెన్స్ కూడా ఇచ్చినట్టు వెల్లడించింది. ఇండియన్ ఆర్మీకి అన్నింటికంటే మానవత్వమే ప్రధానమని పేర్కొంది.
For More News..