ఇండియన్ ఆర్మిలో ఎస్ఎస్సీ టెక్ 2024 రిక్రూట్ మెంట్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 63వ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ ఎస్ సీ) టెక్ పురుషులు, 34వ ఎస్ ఎస్ సీ టెక్ ఉమెన్ కోర్సుల కోసం ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ joiindianarmy.nic ద్వారా దరఖాస్తు ఫారమ్ లను సమర్పించవచ్చు.
దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేది : ఫిబ్రవరి 21, 2024.
అవివాహిత పురుషులు, మహిళా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు , భారత సైన్యంలో ఎస్ ఎస్ సీ లో విధులు నిర్వహిస్తూ మరణించిన భారత సాయుధ దళా రక్షణ సిబ్బందికి చెందిన వితంతులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. షార్ట్ లిస్ చేయబడిన అభ్యర్థులకు 49 వారాలపాటు చెన్పైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఇస్తారు.
ఖాళీలు:
- ఈ రిక్రూట్ మెంట్ మొత్తం 381 ఖాళీలు భర్తీ చేస్తారు.
- వీటిలో ఎస్ ఎస్ సీ టెక్ 350, ఎస్ ఎస్ సీ (టెక్ ) మహిళలకు 29
- రక్షణ సిబ్బంది వితంతువులకు 2 ఖాళీలు ఉన్నాయి.
అర్హత:
విద్యార్హత: అవసరమైన ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సుల్లో ఉత్తీర్ణత
ఇంజనీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హలే.
వయో పరిమితి:
ఎస్ ఎస్ సీ(టెక్) పురుషులు, మహిళా అభ్యర్థులకు అక్టోబర్ 1, 2024 నాటికి వయస్సు 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
భారత సాయుధ దళాల రక్షణ సిబ్బంది వితంతువులకు అక్టోబర్ 1, 2024 నాటికి గరిష్టంగా 35 సంవత్సరాలు
ఎంపిక చేయు విధానం:
- రిక్రూట్ మెంట్ ప్రక్రియలో రెండు స్టేజ్ లు ఉంటాయి.
- స్టేజ్ 1 క్లియర్ చేసిన వారు స్టేజ్ 2 కి వెళతారు.
- స్టేజ్ 1లో ఫెయిల్ అయిన వారు అదే రోజు రిటర్న్ చేయబడతారు.
దరఖాస్తు చేయడం ఎలా :
- - joiindiaarmy.nic.in అధికారిక వెబ్ సైట్ సందర్శించాలి.
- ఆఫీసర్ ఎంట్రీ దరఖాస్తు/ లాగిన్ ఎంచుకొని నమోదు సెలెక్ట్ చేసుకోవాలి
- పాస్ వర్డ్, వినియోగదారు పేరును క్రియేట్ చేయడానికి సైన్ అప్ ప్రక్రియ పూర్తి చేయాలి
- లాగిన్ అవ్వాలి
- మీ అకడమిక్ , వ్యక్తిగత సమాచారం ఎంటర్ చేయాలి
- ఫీజు చెల్లించి అవసరమైన ఫైళ్లను అప్ లోడ్ చేయాలి
- దరఖాస్తు పూర్తి అయిన తర్వాత నిర్ధారణ పేజీని డౌన్ లోడ్ చేసుకోవాలి. ఓ ప్రింట్ అవుట్ తీసుకోవాలి
ఎంపిక తర్వాత..
- ఎంపికైన అభ్యర్థులు శిక్షణ కాలంలో లెఫ్టినెంట్ కు పూర్తి వేతనం, అలవెన్సులను ఇస్తారు.
- కోర్సు ప్రారంభమైన తేది నుంచి లేదా ప్రీ కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీలో రిపోర్టింగ్ తేది నుంచి లెఫ్టినెంట్ ర్యాంక్ లో ప్రొబేషన్ పై షార్ట్ సర్వీస్ కమిషన్ మంజూరు చేయబడుతుంది.
- శిక్షణ పూర్తయిన తర్వాత పే, అలవెన్సులు చెల్లించబడతాయి.