
పంచకుల(హర్యానా): ఇండియా అథ్లెట్ కిరణ్ పహల్ పారిస్ ఒలింపిక్స్ బెర్తు సాధించింది. నేషనల్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం జరిగిన విమెన్స్ 400 మీటర్ల సెమీఫైనల్ రేసును 50.92 సెకండ్లలో ముగించి ఒలింపిక్ క్వాలిఫికేషన్ మార్కు (50.95 సె) అందుకుంది.