
హైదరాబాద్ : నార్త్ అమెరికాలోని క్లేవ్‌లాండ్‌లో జరుగుతున్న పాన్ అమెరికన్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ గేమ్స్ లో తెలంగాణ మాస్టర్ అథ్లెట్లు జగజీవన్ రెడ్డి, శ్యామల వెసపోగు పతకాలు గెలిచారు. అడ్వకేట్, మాస్టర్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అయిన జగజీవన్ రెడ్డి పురుషుల జావెలిన్ త్రోలో (22.56 మీటర్లు) గోల్డ్, సైఫాబాద్ పీఎస్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న శ్యామల వెసపోగు మహిళల షాట్ పుట్ (5.10 మీటర్లు)లో బ్రాంజ్ మెడల్స్ నెగ్గారు.