బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ సుదిర్మన్‌‌‌‌ కప్‌‌‌‌ నుంచి ఇండియా ఔట్‌‌‌‌

బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ సుదిర్మన్‌‌‌‌ కప్‌‌‌‌ నుంచి ఇండియా ఔట్‌‌‌‌

జియామెన్‌‌‌‌ (చైనా): వరుసగా రెండు పరాజయాలతో ఇండియా బ్యాడ్మింటన్‌‌‌‌ టీమ్‌‌‌‌.. బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ సుదిర్మన్‌‌‌‌ కప్‌‌‌‌ నుంచి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. మంగళవారం జరిగిన గ్రూప్‌‌‌‌–డిలో ఇండియా 1–4తో ఇండోనేసియా చేతిలో కంగుతిన్నది. మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో తనీషా క్రాస్టో–ధ్రువ్‌‌‌‌ కపిల 10–21, 21–18, 21–19తో రెహన్‌‌‌‌ నౌఫల్‌‌‌‌–గ్లోరియా ఎమానుయెల్‌‌‌‌ విడ్జలాపై గెలిచారు. కానీ విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో డబుల్‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌ పీవీ సింధు 12–21, 13–21తో పుత్రి కుసుమ వార్డాని చేతిలో ఓడింది. 

దీంతో స్కోరు 1–1తో సమమైంది. మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో ప్రణయ్‌‌‌‌ 21–19, 14–21, 12–21తో జొనాథన్‌‌‌‌ క్రిస్టీ చేతిలో పరాజయం చవిచూడగా... విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో ప్రియా–శ్రుతి మిశ్రా 10–21, 9–21తో లానీ ట్రియా–ఫడియలా చేతిలో  చిత్తవడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు. గురువారం ఇంగ్లండ్‌‌తో జరిగే  చివరి మ్యాచ్ నామమాత్రమే కానుంది.