
ఇండియన్ బ్యాంక్ దేశ వ్యాప్తంగా ఉన్న ఐబీ శాఖల్లో స్కేల్ 1, 2, 3, 4లలో ఖాళీగా ఉన్న 146 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: సంబంధిత విభాగంలో సీఏ, సీడబ్ల్యూఏ, ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
సెలెక్షన్: షార్ట్‌లిస్ట్, రాత/ ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. జనరల్ అభ్యర్థులు రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 1 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వివరాలకు www.indianbank.in వెబ్సైట్లో సంప్రదించాలి.