సమాజం కోసం భారీగా ఖర్చు చేస్తున్న అదానీ,శివనాడార్

సమాజం కోసం భారీగా ఖర్చు చేస్తున్న అదానీ,శివనాడార్

సింగపూర్ : భారతీయ బిలియనీర్లు గౌతమ్ అదానీ, శివ్ నాడార్,  అశోక్ సూత భారీగా సంపాదించడమే కాదు సమాజానికి మంచి చేయడానికీ భారీగా ఖర్చు చేస్తున్నారు. ఫోర్బ్స్ ఆసియా  హీరోస్ ఆఫ్ ఫిలాంత్రోపీ లిస్ట్​ 16వ ఎడిషన్‌‌‌‌లో ఈ ముగ్గురూ స్థానం సంపాదించుకున్నారు. మలేషియా- భారతీయ వ్యాపారవేత్త బ్రహ్మల్ వాసుదేవన్,  ఆయన భార్య శాంతి కందియా పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. సమాజం కోసం భారీగా ఖర్చు చేస్తున్న ఆసియా–-పసిఫిక్ ప్రాంత ప్రముఖులతో ఈ లిస్టును తయారు చేశామని ఫోర్బ్స్​ పేర్కొంది. అదానీ ఈ ఏడాది జూన్‌‌‌‌లో తనకు 60 ఏళ్లు నిండిన సందర్భంగా రూ. 60 వేల కోట్లు ( 7.7 బిలియన్ డాలర్లు) సమాజసేవకు ఖర్చు చేస్తానని ప్రకటించి, భారతదేశంలోని అత్యంత భారీ దాతల్లో ఒకరిగా నిలిచారు. ఈ డబ్బును ఆరోగ్య సంరక్షణ, విద్య,  నైపుణ్యాభివృద్ధికి ఉపయోగిస్తారు. 1996లో ఏర్పాటైన అదానీ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం భారతదేశంలోని దాదాపు 37 లక్షల మందికి సహాయం చేస్తారు. ఈ జాబితాలో రెండోస్థానంలో నిలిచిన శివ్ నాడార్ భారతదేశంలోని ప్రముఖ సంఘసేవకుల్లో ఒకరు. తన సంపదలో దాదాపు బిలియన్ డాలర్లను సామాజిక సేవా కార్యక్రమాలకు అందించారు. ఈయన 1994లో స్థాపించిన ఫౌండేషన్‌‌‌‌కు రూ. 11,600 కోట్లు ( 142 మిలియన్ డాలర్లు) విరాళంగా ఇచ్చారు. విద్య ద్వారా పేదలకు మంచి భవిష్యత్​ కల్పించడానికి ఈ ఫౌండేషన్​ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

 స్కూళ్లు, యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలను స్థాపించడానికి నాడార్​ సహాయం చేశారు. ముసలితనంలో వచ్చే ఇబ్బందులు,  నరాల సంబంధిత వ్యాధులపై స్టడీ కోసం  తాను స్థాపించిన మెడికల్ రీసెర్చ్ ట్రస్ట్‌‌‌‌కు రూ. 600 కోట్లు ( 75 మిలియన్ డాలర్లు) కేటాయిస్తానని టెక్ టైకూన్ అశోక్ సూత  హామీ ఇచ్చారు. ఇది వరకే ఆయన 200 కోట్ల రూపాయల ఖర్చుతో ‘సైంటిఫిక్​ నాలెడ్జ్​ఫర్​ ఏజింగ్​ అండ్​ న్యూరోలాజిక్​ ఏల్​మెంట్స్​’ అనే సంస్థను మొదలుపెట్టారు.  బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌‌‌‌వేర్ సేవల సంస్థ హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్‌‌‌‌లో మెజారిటీ వాటాదారుడు  అశోక్ సూత.​ పార్కిన్సన్స్ వ్యాధికి సంబంధించిన పరిశోధన కోసం ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌‌‌‌లోని సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్  నేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌తో కలిసి స్కాన్​ పనిచేస్తున్నట్లు చెప్పారు.   తాను చదువుకున్న రూర్కీ ఐఐటీకి కూడా రూ. 20 కోట్ల గ్రాంట్‌‌‌‌ను ఇచ్చారు. వాసుదేవన్, శాంతి దంపతులు తమ ఫౌండేషన్​ ద్వారా మలేషియాతోపాటు భారతదేశంలో సేవ చేస్తున్నారు. ఈ సంవత్సరం మేలో మలేషియాలోని పెరాక్ రాష్ట్రంలో  మెడికల్​ కాలేజీని నిర్మించడానికి11 మిలియన్ డాలర్లను విరాళంగా అందజేశారు. పరిశోధనల కోసం 30 మిలియన్ డాలర్లను లండన్​లోని ఇంపీరియల్ కాలేజ్​కు విరాళంగా అందించారని ఫోర్బ్స్​ తెలిపింది.