వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఆమె చేసిన పాదయాత్రకు ఈ అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణలో 2021 అక్టోబర్ 20 నుంచి చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన వైఎస్ షర్మిల దాదాపు ఏడాదిన్నరపాటు కొనసాగించింది.
మొత్తంగా 3,800 కిలోమీటర్ల దూరం నడిచిన తొలి మహిళగా ఆమె రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఆగస్టు 15న షర్మిలను అభినందించి అవార్డు అందజేశారు. పాదయాత్రలో భాగంగా ఆమె సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ALSO READ:కాన్ఫిడెంట్ అంటే ఇదీ : 21 ఏళ్లకే 13 ఉద్యోగాలు వదిలేసింది.. ఇప్పుడు 20 లక్షల జీతం..
అవి అప్పట్లో సంచలనం సృష్టించాయి. నర్సంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్లు యాత్రకు బ్రేక్‌పడగా, ఆమె హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు.
గతంలో ఏపీలోనూ పాదయాత్ర చేసినా తెలంగాణలో చేసింది మాత్రం సుదీర్ఘంగా చేసినట్లుగా రికార్డ్స్నెలకొల్పారు.