IND vs AUS: నిలబెట్టిన బౌలర్లు.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 4 పరుగుల ఆధిక్యం

IND vs AUS: నిలబెట్టిన బౌలర్లు.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 4 పరుగుల ఆధిక్యం

బ్యాటర్లు విఫలమైన చోట బౌలర్లు నిలబెడుతున్నారు. సిడ్నీ టెస్టులో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లు ప్రసిద్ కృష్ణ, సిరాజ్, బుమ్రా, నితీష్ రెడ్డి విజృంభించడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 181 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ అరంగేట్ర ఆటగాడు వెబ్‌స్టర్ (57) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ 3, మహ్మద్ సిరాజ్ 3, జస్ప్రీత్ బుమ్రా 2, నితీష్ రెడ్డి 2 వికెట్లు పడగొట్టారు.

Also Read :- నేను రిటైర్‌ అవ్వలేదు.. రెస్ట్ మాత్రమే.. మౌనం వీడిన రోహిత్ శర్మ

అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. 40 పరుగులతో రిషభ్ పంత్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివరలో రవీంద్ర జడేజా(26), వాషింగ్టన్ సుందర్(14), కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(22) విలువైన పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, స్టార్క్ 3, కమిన్స్ 2 వికెట్లు పడగొట్టారు.