Paris Olympics 2024: పతకం ఆశలు ఆవిరి.. ప్రీ క్వార్టర్స్‌లో వెనుదిరిగిన తెలంగాణ బాక్సర్  

Paris Olympics 2024: పతకం ఆశలు ఆవిరి.. ప్రీ క్వార్టర్స్‌లో వెనుదిరిగిన తెలంగాణ బాక్సర్  

రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశ పరిచింది. మహిళల 50 కేజీల విభాగంలో ప్రీ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. గురువారం (ఆగస్ట్ 1) చైనా బాక్సర్ వు యుతో జరిగిన రౌండ్ ఆఫ్ 16 బౌట్‌లో నిఖత్ జరీన్ 0:5 తేడాతో ఓటమి పాలైంది. చైనా బాక్సర్ పంచుల ముందు భారత బాక్సర్ నిలవలేకపోయింది.

ALSO READ : Paris Olympics 2024:. పారిస్ ఒలింపిక్స్.. బెల్జియం చేతితో భారత్ ఓటమి

అంతకుముందు నిఖత్ జరీన్‌ తొలి బౌట్‌లో జర్మనీ బాక్సర్ ‪మాక్సీ కరీనా క్లోట్జర్‌పై గెలిచి రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టింది.