
బ్యాంకాక్: ఇండియా బాక్సర్ నిషాంత్ దేవ్ పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు. దాంతో మెన్స్‌లో ఇండియా నుంచి పారిస్ బెర్తు దక్కించుకున్న తొలి బాక్సర్‌గా నిలిచాడు. వరల్డ్ బాక్సింగ్ ఒలింపిక్స్ రెండో క్వాలిఫయర్స్‌లో సెమీఫైనల్ చేరుకోవడంతో అతని బెర్తు ఖాయం అయింది. ఓవరాల్‌గా ఇండియాకు ఇది నాలుగో బెర్తు. విమెన్స్‌లో నిఖత్ జరీన్, ప్రీతి పవార్, లవ్లీనా బొర్గొహైన్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యారు.
శుక్రవారం జరిగిన మెన్స్ 71 కేజీ క్వార్టర్స్ బౌట్‌లో నిశాంత్ 5-–0తో వాసిలె సెబోటరీ(మాల్దోవా)ను చిత్తు చేసి సెమీస్ చేరుకున్నాడు. 51 కేజీ ప్రిక్వార్టర్స్‌లో అమిత్ పంగల్ 5-–0తో కిమ్ ఇంక్యు(కొరియా)పై, 57 కేజీ క్వార్టర్స్‌లో సచిన్ సివాచ్ 4-1తో శామ్యుల్ కిస్తౌరి (ఫ్రాన్స్)పై నెగ్గి క్వార్టర్ చేరారు. పారిస్ బెర్తుకు మరో విజయం దూరంలో నిలిచారు. అయితే, సంజీత్ (92 కేజీ), విమెన్స్‌లో అంకుశిత బొరో (60 కేజీ), అరుంధతి చౌదరి (66 కేజీ) తమ బౌట్లలో ఓడి ఇంటిదారి పట్టారు.