నిశాంత్ పంచ్ అదుర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నిశాంత్ పంచ్ అదుర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ : ఇండియా స్టార్ బాక్సర్ నిశాంత్ దేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొఫెషనల్ బాక్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అదిరిపోయే ఆరంగేట్రం చేశాడు. అమెరికాలోని లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెగాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శనివారం రాత్రి జరిగిన సూపర్ వెల్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెయిట్ కేటగిరీ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమెరికాకు చెందిన అల్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విగ్గిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఘన విజయం సాధించింది. ఆరు రౌండ్లు జరగాల్సిన బౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిషాంత్  పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వర్షం కురిపించడంతో విగ్గిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తట్టుకోలేకపోయాడు. 

దేశ త్రివర్ణ రంగు జెర్సీ వేసుకొని బరిలోకి దిగిన 24 ఏండ్ల నిశాంత్​ ఆటమొదలైన వెంటనే దూకుడు చూపెట్టాడు. వరుసగా జాబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హూక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో విగ్గిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతని దెబ్బకు విగ్గిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే రెండుసార్లు కిందపడ్డాడు. దాంతో తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో 20 సెకండ్లు మిగిలుండగానే  రిఫరీ బౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆపి టెక్నికల్ నాకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా నిషాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విజేతగా ప్రకటించాడు.