
అమన్ (జోర్డాన్): ఆసియా అండర్–15, 17 చాంపియన్‌షిప్‌లో మరో ఐదుగురు ఇండియా బాక్సర్లు సెమీస్‌లోకి ప్రవేశించారు. బుధవారం రాత్రి జరిగిన అండర్–15 మెన్స్ 55 కేజీ తొలి రౌండ్‌లో నెల్సన్ ఆర్‌ఎస్‌సీ (రిఫరీ స్టాప్ కంటెస్ట్) ద్వారా వాంగ్ షెంగ్-యాంగ్ (చైనీస్‌తైపీ)పై గెలిచాడు. 61 కేజీ క్వార్టర్‌ఫైనల్లో అభిజీత్ 5–0తో ముఖమ్మద్ బుర్ఖానోవ్ (కిర్గిస్తాన్)పై గెలవగా, 64 కేజీల్లో లక్షయ్ ఫోగట్ 5–0తో లైత్ అజైలత్ (జోర్డాన్)ను ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టారు.
బాలికల 52 కేజీల్లో ప్రిన్సి 5–0తో యెవా కుబనోవా (ఉక్రెయిన్)పై, 55 కేజీల్లో సమృద్ధి సతీష్ షిండే ఆర్‌ఎస్‌సీ ద్వారా క్సేనియా సవినా (ఉక్రెయిన్)పై నెగ్గి సెమీస్‌కు చేరారు. ఇక మెన్స్ 52 కేజ్లీలో రవి సిహాగ్ 2–3తో ఎల్షాడ్ షకీర్జోనోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో, 58 కేజీల్లో నమన్ సైనీ 0–5తో జఖోంగిర్ జాన్ ఉస్మాన్ కులోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో పరాజయం చవిచూశారు.