
అమాన్ (జోర్డాన్) : ఆసియా అండర్-–15, అండర్–-17 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా బాక్సర్లు అదరగొడుతున్నారు. మెగా టోర్నీలో ఆరుగురు యంగ్ బాక్సర్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన అండర్–15 మెన్స్ 46 కేజీల క్వార్టర్ ఫైనల్లో రుద్రాక్ష్ సింగ్ 3–-0 తేడాతో కిర్గిస్తాన్‌కు చెందిన ఐడార్ ముసాయేవ్‌పై విజయం సాధించాడు. 35 కేజీ కేటగిరీ బౌట్‌లో సంస్కార్ వినోద్ ఆత్రం 4-–1 తేడాతో మహ్మూద్ అల్మత్వోలి (జోర్డాన్)పై గెలిచాడు.
37 కేజీల క్వార్టర్స్‌లో హర్షిల్ 5-–0 తో ముహమ్మద్ అలీ సెర్డారోవ్ (తుర్క్‌మెనిస్తాన్)ను చిత్తు చేశాడు. ప్రిక్షిత్ బాలహారా (40 కేజీ) 3–-2 తేడాతో అఖ్మేత్‌ఖాన్ నూర్‌సల్యేమ్ (మంగోలియా)పై కష్టపడి నెగ్గగా, 49 కేజీల బౌట్‌లో సంచిత్ జయాని 5–-0 తేడాతో యు చెన్ -ఎన్ (తైవాన్)పై గెలిచాడు. మరోవైపు విమెన్స్ అండర్–15 విభాగంలో మిల్కీ మైనమ్ (43 కేజీ) కూడా 5–-0 తో ఎల్డానా అబ్దిగాని (కజకిస్తాన్)పై ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది.