
ఇండియా బాక్సింగ్ క్వీన్ నిఖత్ జరీన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను శుక్రవారం కలిసింది. ఇటీవల నెగ్గిన ఎలోర్డా కప్ గోల్డ్ మెడల్‌ను సచిన్‌కు చూపించింది. పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటాలంటూ సచిన్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ‘నిన్ను చూసి దేశం గర్విస్తోంది’ అంటూ ఆమె జెర్సీపై మెసేజ్ రాసి సంతకం చేశాడు. ఈ సందర్భంగా నిఖత్, సచిన్ బాక్సింగ్ గ్లోవ్స్‌తో ఫొటో దిగారు.