నేపాల్ లోయలో పడిన ఇండియా బస్సు : 40 మంది టూరిస్టులపై ఆందోళన

నేపాల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మన దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్ పూర్ నుంచి 40 మంది యాత్రికులతో నేపాల్ వెళ్లిన బస్సు.. అబుఖైరేని, తన్ హున్ ప్రాంతాల మధ్య పెద్ద లోయలో పడింది. బస్సు పల్టీలు కొడుతూ.. లోయలో తిరగబడింది. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ఉన్నారు. 16 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

ప్రమాద విషయం తెలిసిన వెంటనే నేపాల్ స్థానిక పోలీస్ అధికారి స్థటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులోని ప్రయాణికులను కాపాడేందుకు సాయుధ బలగాలు, సైన్యం సాయం కావాలని సమాచారం ఇచ్చారు. లోయ నుంచి బాధితులను బయటకు తీసుకు వచ్చే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read :- హర్యానాలో కాంగ్రెస్ దే పైచేయి

ఈ బస్సు యూపీ రాష్ట్రం గోరఖ్ పూర్ నుంచి బయలుదేరింది. బస్సులోని యాత్రికులు అందరూ భారతీయులే. దీంతో యూపీ సర్కార్ సైతం స్పందించింది. భారత ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. బాధితులను సురక్షితంగా, క్షేమంగా ఇండియా తీసుకొచ్చేందుకు.. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు నేపాల్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు యూపీ అధికారులు.