
పదవ తరగతి పాసైనవారికి శుభవార్త. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ (కుక్ అండ్ స్టివార్డ్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 50 ఖాళీలున్నాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 01/2021 బ్యాచ్‌లో భర్తీ చేస్తున్న ఖాళీలు ఇవి. 10వ తరగతి పాసైనవాళ్లు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2020 నవంబర్ 30న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 7 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://joinindiancoastguard.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.
భర్తీ చేసే పోస్టులు- నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ (కుక్ అండ్ స్టివార్డ్)
మొత్తం ఖాళీలు- 50
జనరల్- 20
ఈడబ్ల్యూఎస్- 5
ఓబీసీ- 15ఎస్టీ- 3
ఎస్సీ- 8