
కోస్ట్‌గార్డ్ ఎన్రోల్డ్పర్సనల్ టెస్ట్(సీజీఈపీటీ)–02/2025 బ్యాచ్ ద్వారా నావిక్(జనరల్ డ్యూటీ), నావిక్(డొమస్టిక్బ్రాంచ్) ఉద్యోగాల భర్తీకి కోస్ట్‌గార్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఈ నెల 25వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు (300) : నావిక్(జనరల్ డ్యూటీ) 260 రీజియన్లు( నార్త్–65, వెస్ట్–53, ఈస్ట్– 38, సౌత్–54, సెంట్రల్ – 50), నావిక్(డొమస్టిక్ బ్రాంచ్) 40 రీజియన్లు(నార్త్–10, వెస్ట్–09, ఈస్ట్–05, సౌత్–09, సెంట్రల్–17).
ఎలిజిబిలిటీ : నావిక్ జనరల్ పోస్టులకు 12వ తరగతి(మ్యాథ్స్/ ఫిజిక్స్), నావిక్ డొమస్టిక్ బ్రాంచ్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 2003, సెప్టెంబర్ 1 నుంచి 2007, ఆగస్టు 28 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. అంటే 18 నుంచి 22 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎసీ, ఎస్టీలకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్ : ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. పరీక్ష రుసుం రూ.300. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్ : స్టేట్–1, స్టేజ్–2, స్టేజ్–3,
స్టేజ్–4 ఎగ్జామ్స్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
ఐఎన్ఏలో ఆఫీసర్ఉద్యోగాలు
షార్ట్సర్వీస్ కమిషన్ఆఫీసర్ పోస్టుల భర్తీకి కేరళలోని ఇండియన్ నావల్ అకాడమీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన పురుష అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు : ఎడ్యుకేషన్15, నావల్ కన్స్ట్రక్టర్18, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్18, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్22, లాజిస్టిక్స్28, పైలట్26, ఇంజినీరింగ్ బ్రాంచ్38, ఎలక్ట్రికల్బ్రాంచ్45, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్60 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎలిజిబిలిటీ : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(బీఎస్సీ, బీకామ్), పీజీ(ఎంసీఏ, ఎంఎస్సీ), బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.