సౌదీ దిరియాహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇండియన్‌‌ కంపెనీలు క్యూ

సౌదీ దిరియాహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇండియన్‌‌  కంపెనీలు క్యూ

న్యూఢిల్లీ: సౌదీ అరేబియా చేపడుతున్న మెగా ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిరియాహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సిటీ ఆఫ్ ఎర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) లో భాగస్వామ్యం అయ్యేందుకు ఇండియన్ కంపెనీలు క్యూ కడుతున్నాయి.  సుమారు 63.2 బిలియన్ డాలర్ల (రూ.5.50 లక్షల కోట్ల) తో  రియాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దగ్గరలో ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కడుతున్నారు.  ఇప్పటికే టాటా, ఓబ్రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తాజ్ హోటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   ఆసక్తి చూపించాయని   దిరియాహ్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సీఈఓ జెర్రీ ఇంజెరిలో  పేర్కొన్నారు. మరిన్ని కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తాయని చెప్పారు. దిరియాహ్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా   లక్ష రెసిడెన్షియల్ యూనిట్లను, మరో లక్ష ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను  నిర్మిస్తారు.

 అంతేకాకుండా 40 లగ్జరీ హోటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెయ్యికి పైగా షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, 150 కి పైగా రెస్టారెంట్లు, కేఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఒక ఒపేరా హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మ్యూజియం, గోల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 20 వేల మంది సిట్టింగ్ కెపాసిటీ ఉండే గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటివి దిరియాహ్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్యలో యూనెస్కో హెరిటేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైట్  ఎట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–టురైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఆధునిక సౌదీ కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డమ్ పుట్టిన చోటు)  ఉంటుంది. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.  250వ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను   దిరియాహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తాజ్ హోటల్ ఓపెన్ చేయనుందని,  గుర్రపు స్వారీ నేర్పించే సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓబ్రాయ్ హోటల్ డెవలప్ చేయనుంది. ఇండియన్ టూరిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఆకర్షించడానికి సౌదీ ఆరేబియా భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. కిందటేడాది 15 లక్షల మంది ఇండియన్లు సౌదీలో పర్యటించారని అంచనా.