న్యూఢిల్లీ: రేటింగ్ పొందిన భారతీయ కంపెనీలు వచ్చే రెండేళ్లలో ఏటా 45–-50 బిలియన్ డాలర్లు క్యాపిటల్ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు చేయనున్నాయని మూడీస్ రేటింగ్స్ మంగళవారం తెలిపింది. కంపెనీలు కెపాసిటీని పెంచుకోవడానికి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయనున్నాయి.
దేశంలోని అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యాపెక్స్వాటా 30 శాతం ఉంటుందని మూడీస్ రేటింగ్ పేర్కొంది. వ్యాపారాన్ని మరింత పెంచడానికి నికరసున్నా లక్ష్యాలను సాధించడానికి ఇవి భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. వచ్చే రెండేళ్ళలో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్తోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ పోర్ట్‌ఫోలియో క్యాపెక్స్ వాటా 60 శాతానికి పైగా ఉంటుంది. మనదేశంలోని ఏడు రేటెడ్ చమురు గ్యాస్ కంపెనీలకు క్యాపెక్స్‌లో 30 శాతం వాటా ఉండొచ్చని మూడీస్ పేర్కొంది.