న్యూయార్క్: ప్రెసిడెంట్ ఎన్నిక కోసం హోరాహోరీ పోరు జరుగుతున్న అమెరికాలో వివిధ లోకల్, స్టేట్ఎలక్షన్స్లో అమెరికన్ ఇండియన్స్బరిలో నిలిచారు. వివిధ స్థానాల్లో దాదాపు 36 కంటే ఎక్కువ మంది పోటీలో ఉన్నారు. ఇల్లినాయిస్ 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి రాజా కృష్ణమూర్తి బరిలో నిలిచారు. 2017 నుంచి ఆయన ఇక్కడ విజయం సాధిస్తున్నారు. ఆయన పోటీచేయడమేకాక.. పాలసీ మేకింగ్‌లో ఇండియన్స్ఉండాలంటూ ఆయన ప్రోత్సహిస్తూ వస్తున్నారు.
ఇక దేశంలోనే కాలిఫోర్నియాలో ఎక్కువగా ఇండియన్అమెరికన్ జనాభా ఉన్నది. ఈ రాష్ట్రంలో వివిధ స్థానాలకు ఇండియన్అమెరికన్స్ పోటీపడుతున్నారు. డిస్ట్రిక్ట్ 11 కౌంటీ సూపర్వైజర్గా అడ్లా చిస్తీ, శాన్ఫ్రాన్సిస్కో సిటీ కాలేజ్ బోర్డ్‌లో సీటు పొందేందుకు అలియా చిస్తీ ప్రముఖంగా పోటీలో ఉన్నారు.
కాలిఫోర్నియాలో దర్శన పటేల్(స్టేట్ అసెంబ్లీ), నికోల్ఫెర్నాండె (శాన్ మాంటియో సిటీ కౌన్సిల్), నిత్య రామన్(లాస్ ఏంజెల్స్సిటీ కౌన్సిల్), రిచా అవస్థి (ఫోస్టర్ సిటీ కౌన్సిల్), సుఖ్దీప్ కౌర్ (ఎమెరీవిల్లే సిటీ కౌన్సిల్), తారా శ్రీ కృష్ణన్ (స్టేట్అసెంబ్లీ డిస్ట్రిక్ట్ 26, సిలికాన్ వ్యాలీ) బరిలో నిలిచారు. కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి రో ఖన్నా పోటీలో ఉన్నారు. ఆయన గత ఏడేండ్ల నుంచి గెలుస్తూ వచ్చారు. 6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డాక్టర్ అమిబెరా (59) మరోసారి బరిలో నిలిచారు. 2013 నుంచి ఈ స్థానంలో విజయం సాధిస్తున్నారు.