-
సియాటెల్ అటార్నీని కోరిన ఇండియన్ కాన్సులేట్
వాషింగ్టన్: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇండియన్ స్టూడెంట్ కందుల జాహ్నవి(23) కేసులో సియాటెల్ అటార్నీ తీర్పుపై ఇండియన్ కాన్సులేట్ రివ్యూ కోరింది. యాక్సిడెంట్ చేసి, జాహ్నవి మరణానికి కారణమైన పోలీస్ ఆఫీసర్‌ను సరైన సాక్ష్యాలు లేవంటూ క్రిమినల్ చార్జెస్ నుంచి తప్పించడంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. రోడ్డు ప్రమాదంపై మరింత లోతుగా ఎంక్వైరీ చేయాలని కోరింది.
జాహ్నవి ఫ్యామిలీకి న్యాయం జరిగేలా ప్రయత్నిస్తున్నామని.. తీర్పును రివ్యూ చేయాలని కోరామని ఇండియన్ కాన్సులేట్ శుక్రవారం ‘ఎక్స్’లో ప్రకటించింది. ఈ కేసును ప్రస్తుతం సియాటెల్ సిటీ అటార్నీ ఆఫీసుకు రెఫర్ చేసినట్లు పేర్కొంంది. కాగా, ఏపీకి చెందిన కందుల జాహ్నవి సియాటెల్‌లో మాస్టర్స్ చదివేవారు. గతేడాది జనవరి 23న ఆమె రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వెహికల్ ఢీకొట్టింది.
వెహికల్ తగిలిన స్పీడ్‌కు ఆమె వంద అడుగుల దూరం ఎగిరి పడి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమయంలో వెహికల్ వేగం గంటలకు 120కి.మీ.పైనే ఉంది. ఆ టైమ్‌లో వెహికల్‌ను కెవిన్ డేవ్ అనే పోలీసు అధికారి నడిపించారు. బుధవారం ఈ కేసు రిపోర్టును పరిశీలించిన కింగ్ కౌంటీ ప్రాసిక్యూషన్ అథారిటీ.. కేసులో ప్రధాన నిందుతుడైన కెవిన్ డేవ్‌కు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లేవని అతనిపై క్రిమినల్ చార్జెస్ నమోదు చేయాల్సిందిగా సూచించలేమని తెలిపింది.