Kuwait: కువైట్లో భారతీయ కుటుంబం దుర్మరణం.. ఎంతటి విషాదం అంటే..

Kuwait: కువైట్లో భారతీయ కుటుంబం దుర్మరణం.. ఎంతటి విషాదం అంటే..

కువైట్: ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్లో ఉద్యోగిగా పనిచేస్తూ కువైట్లో స్థిరపడిన కేరళ వాసి కుటుంబం అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదం నింపింది. జులై 19న రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ కుటుంబాన్ని దురదృష్టం ఎంతలా వెంటాడిందంటే అదే రోజు కేరళ నుంచి ఈ కుటుంబం వెకేషన్ ముగించుకుని కువైట్కు వచ్చింది. ఇంటికి వెళ్లిన కొన్ని గంటల్లోనే ఘటన జరిగింది. కువైట్లోని అబ్బాసియా ప్రాంతంలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్లో ఈ కుటుంబం నివాసం ఉంటోంది. సెకండ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ ఉంది. కేరళలోని అలప్పుళ జిల్లా నీరత్తుపురం ప్రాంతానికి చెందిన ఈ కుటుంబం ఇటీవలే కేరళకు వెళ్లింది. మ్యాథ్యూస్ ములకల్, అతని భార్య లీనీ అబ్రహం తమ ఇద్దరు పిల్లలను తీసుకుని కేరళకు వెకేషన్కు వెళ్లారు. ఈ ఫ్యామిలీ ట్రిప్లో సరదగా గడిపారు. ట్రిప్ ముగించుకుని జులై 19న సాయంత్రం 4 గంటలకు కువైట్లోని ఇంటికి చేరుకున్నారు. 

జర్నీ చేసొచ్చి బడలికగా అనిపించి రిలాక్స్ ఫ్యామిలీ అవుతుండగా రాత్రి 8 గంటల సమయంలో ఏసీలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. కాసేపట్లోనే మంటలు ఫ్లాట్ అంతటా వ్యాపించాయి. ఇల్లంతా పొగ కమ్మేసింది. బయటకు వెళ్లే పరిస్థితి లేక ఊపిరాడని స్థితిలో కుటుంబంలోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బాధిత కుటుంబంలో పెను విషాదం నింపింది. మ్యాథ్యూ గత 15 ఏళ్లుగా కువైట్లో పనిచేస్తున్నాడు. అతని భార్య లీనీ స్టాఫ్ నర్స్గా పనిచేస్తోంది. ఇద్దరు పిల్లలను కువైట్లోని భావన్స్ స్కూల్లో చదివించుకుంటూ సంతోషంగా జీవిస్తున్న ఈ కుటుంబానికి ఇలా జరగడంతో మ్యాథ్యూ కుటుంబం కన్నీరుమున్నీరయింది.