
సోషల్‌మీడియా.. మనిషి జీవితంలో పెనుమార్పులు తీసుకొస్తున్న మాధ్యమం. దాని పిచ్చిలో పడి కొందరు తీసుకుంటున్న నిర్ణయాలు నివ్వెరపరిచేలా చేస్తున్నాయి. అలాంటి ఘటనే తాజాగా వెస్ట్‌బెంగాల్‌లో వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పానిహతిలోని గాంధీనగర్‌కు చెందిన జయదేవ్, సాథి దంపతులకు ఏడేళ్ల కుమార్తె, 8 నెలల కుమారుడు ఉన్నారు. కొన్ని రోజులుగా వారి కుమారుడు కనిపించకపోవడంతో స్థానికులు అనుమానించారు. దంపతులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి రీల్స్ చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడాన్ని వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ALSO READ :భారీ వర్షాలతో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ అతలాకుతలం..
వారి సమాధానంతో షాక్..
బాబు ఎక్కడని స్థానికులు ప్రశ్నించగా.. దంపతులు చెప్పిన సమాధానం విని వారు షాక్ అయ్యారు. ఐఫోన్ డబ్బుల కోసం తామే బాబుని అమ్మేసినట్లు వారు చెప్పారు. కోపోద్రిక్తులైన స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. పోలీసులు దంపతులిద్దర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.