అమెరికాలో నౌక తగిలి కూలిన బిడ్జ్.. షిప్‌లో 22 మంది సిబ్బంది భారతీయులు

అమెరికా ఓ పెద్ద బ్రిడ్జి కుప్పకూలింది. బాల్టిమోర్ లోని మరియాలాండ్ సమీపంలో ఉన్న ఫ్రాంసిస్ స్కాంట్ కీ బ్రిడ్జిని భారీ ఓడ ఢీకొనడంతో కూలిపోయింది. మంగళవారం (మార్చి 26) జరిగిన ఈ ప్రమాదంలో ఓడ కూడా పటాప్స్ కో నదిలో మునిగిపోయింది. ఢికొన్న  షిప్‌లో ఉన్న 22 మంది సిబ్బంది భారతీయులేనని చార్టర్ మేనేజ్‌మెంట్ సంస్థ పేర్కొంది. వారిలో ఇద్దరు వ్యక్తులను రక్షించారని, మరో ఆరుగురు తప్పిపోయినట్లు తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. 

ప్రమాద సమయంలో బ్రిడ్జి పై ప్రయాణిస్తున్న వందలాది వాహనాలు నీట మునిగిపోయాయి. ఈ బిడ్జ్ 1977 లో ప్రారంభించారు.  ఒక కార్గో​ నౌక, బ్రిడ్జి పిల్లర్​ను ఢీకొనడం వల్ల 'ఫ్రాన్సిస్​ స్కాట్​ కీ బ్రిడ్జి' కుప్ప కూలింది. ఈ బ్రిడ్జిని బాల్టిమోర్​లోని పటాప్‌స్కో నదిపై నిర్మించారు. 'ది స్టార్​-స్పాంగ్లిల్డ్​ బ్యానర్​' అనే అమెరికా జాతీయ గీతం రాసిన ఫ్రాన్సిస్​ స్కాట్​ కీ పేరును ఈ బ్రిడ్జికి పెట్టారు. బాల్టిమోర్​ నౌకాశ్రయంతో పాటు, తీర ప్రాంతంలో షిప్పింగ్​కు ఈ బ్రిడ్జి ప్రధాన రవాణా మార్గంగా ఉంది.