వరల్డ్ కప్ లో భాగంగా ప్రాక్టీస్ మ్యాచ్ కి టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ తో ఆడేందుకు నేడు గౌహతికి చేరుకున్నారు. ఇక జట్టుతో కలిసి అశ్విన్ కూడా ప్రయాణించడం ఆసక్తికరంగా మారింది. వరల్డ్ కప్ కి ఎంపికవ్వాని అశ్విన్ వార్మప్ మ్యాచుల కోసం గౌహతి ప్రయాణం అవ్వడంతో అక్షర్ పటేల్ కి అవకాశం దక్కనట్లుగానే కనిపిస్తుంది. సెప్టెంబర్ 30న ఇంగ్లాండ్ తో తొలి వార్మప్ మ్యాచ్, అక్టోబర్ 3 న నెదర్లాండ్స్ తో మరో వార్మప్ టీమిండియా ఆడనుంది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచుకు ఆతిధ్యమిస్తుంది.
ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్
వరల్డ్ కప్ లో భాగంగా తొలి మ్యాచ్ భారత్ అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తలపడబోతుంది. ఇక అందరూ ఎదురు చూస్తున్న పాకిస్థాన్ పై మ్యాచ్ అక్టోబర్ 14 న జరగబోతుంది. ఈ వరల్డ్ కప్ లో మొత్తం 10 జట్లు ఆడుతుండగా రౌండ్ రాబిన్ పద్ధతిలో ఈ మ్యాచులను నిర్వహించనున్నారు.అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వరల్డ్ కప్ జరగనుంది.
Huge roar for Rohit & Kohli at Guwahati....!!!!
— Johns. (@CricCrazyJohns) September 28, 2023
India will kick start their World Cup on 30th with a warm-up game.pic.twitter.com/EuWGtJ5xeZ