ఓ వైపు భారత్ లో వరల్డ్ కప్ సందడి చేస్తుంటే కుర్రాళ్లతో కూడిన యంగ్ టీమిండియా సత్తా చాటేందుకు చైనాకి వెళ్ళింది. ఆసియా గేమ్స్ లో భాగంగా భారత క్రికెట్ జట్టు గురువారం భారత్ నుంచి బయలుదేరింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ముంబై ఎయిర్‌పోర్ట్‌ను వదిలి చైనాకు వెళ్లిన ఫోటోలను షేర్ చేసింది.
తొలి మ్యాచ్ ఎప్పుడంటే..?
టీమిండియా అక్టోబర్ 3న తమ తొలి మ్యాచ్ ఆడనున్నారు. అక్టోబర్ 6 న రెండో మ్యాచ్ , 7న మరో మ్యాచ్ ఆడుతుంది. అయితే టీమిండియా ప్రత్యర్ధులు ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. తొలి రెండు మ్యాచులు ఉదయం 6:30 నిమిషాలకు, మూడో మ్యాచ్ ఉదయం 11:30నిమిషాలకు జరుగుతాయి. టీవీల్లో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఈ మ్యాచులను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. మొబైల్ ఫోన్ లో SonyLIV యాప్ లో ఈ మ్యాచులను చూడొచ్చు.
ALSO READ: వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ స్పిన్నర్ ఔట్
టీమిండియా స్క్వాడ్:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్-కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ దూబే, ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ఆకాశ్ దీప్
స్టాండ్‌బై ప్లేయర్స్:
యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్
?Men's Cricket team is all set for #AsianGames2022! ???#TeamIndia have taken off from Mumbai airport, bound for Hangzhou, for their much-anticipated campaign at the #AsianGames2022. ??
— SAI Media (@Media_SAI) September 28, 2023
We wish them the very best for their performance ⚡???
Let's all #Cheer4India… pic.twitter.com/jYl0T2fqtw