బంతిని చేతితో పట్టుకుని ఔటైన ఏకైక భారత బ్యాటర్

బంతిని చేతితో పట్టుకుని ఔటైన  ఏకైక భారత బ్యాటర్

క్రికెట్ అనేది క్రేజీ గేమ్. ఈ గేమ్లో బ్యాట్స్మన్ను అనేక రకాలుగా ఔట్ చేయొచ్చు. బౌల్డ్, క్యాచ్, రన్ ఔట్ ద్వారా బ్యాటర్ను పెవీలియన్ చేర్చొచ్చు. అయితే కొన్ని సార్లు మాత్రం అసాధారణంగా బ్యాటర్ ఔటవడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అలాంటి వాటిల్లో బంతిని చేతితో పట్టుకుంటూ ఔట్ అవడం  ఒక విచిత్రమైన ఔట్గా పరిగణిస్తారు.  క్రికెట్ చరిత్రలో  ఈ విధంగా  22 మంది బ్యాటర్లు ఔటయ్యారు. టీమిండియా నుంచి మాత్రం ఒకే ఒక్క బ్యాట్స్ మన్ బంతిని చేతితో పట్టుకుని పెవీలియన్ చేరాడు. 

టీమిండియా నుంచి ఒకే ఒక్కడు..

బంతిని చేతితో కావాలని పట్టుకుని ఔటైన టీమిండియా బ్యాట్స్ మన్ మొహిందర్ అమర్ నాథ్. 1983 వరల్డ్ కప్ హీరో అయిన మొహిందర్ అమర్నాథ్..తన కెరీర్ లో రెండు సార్లు బంతిని చేతితో పట్టుకుని ఔటయ్యాడు. ఈ రెండు సార్లు వన్డేల్లోనే ఔటవడం మరో విశేషం. 

ఎప్పుడంటే..

1986లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అమర్‌నాథ్ తొలిసారిగా బాల్‌ను చేతితో పట్టుకుని అవుటయ్యాడు. అతను 15 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆఫ్ స్పిన్నర్ గ్రెగ్ మాథ్యూస్ ఫ్లైట్ డెలివరీ వేశాడు. ఈ బంతిని అమర్‌నాథ్ బంతి డిఫెన్స్ ఆడబోయాడు. అయితే  బంతి కాస్తా  స్టంప్‌ల వైపు వెళ్తుండగా.. తన చేతులతో బంతిని ఆపాడు. తన తప్పును గ్రహించిన  అమర్‌నాథ్ ..పెవిలియన్‌ వైపు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఆ తర్వాత 1989లో శ్రీలంకపై కూడా అమర్ నాథ్ ఇలాగా ఔటయ్యాడు. శ్రీలంకతో జరిగిన వన్డేలో ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అమర్‌నాథ్ 28 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్ చేసే క్రమంలో బంతి ఫీల్డర్ కు దొరక్కుండా కావాలని తన్నాడు. దీంతో అతన్ని అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. ఇప్పటి వరకు ఏ భారతీయ బ్యాటర్ కూడా ఇలా ఔట్ కాలేదు. 

అమర్నాథ్ తర్వాత..మరో బ్యాటర్..

అమర్నాథ్ తర్వాత బంతిని చేతితో పట్టుకుని ఔటైన బ్యాట్స్ మన్ పుజారా. అయితే ఇది అంతర్జాతీయ మ్యాచ్ లో మాత్రం కాదు. కౌంటీ క్రికెట్లో డెర్బీషైర్, లీసెస్టర్‌షైర్ మధ్య జరిగిన మ్యాచులో బంతిని హ్యాండిల్ చేసినందుకు  చెతేశ్వర్ పుజారా ఔట్ అయ్యాడు. 6  పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు  పుజారాకు బౌలర్ అతిఫ్ షేక్ బౌలింగ్ వేశాడు. అయితే బంతి శరీరాన్ని తాకి స్టంప్స్ పై పడబోయింది. ఈ సమయంలో పుజారా బంతిని చేతితో అడ్డుకుని ఔటయ్యాడు. మొత్తం