అబ్బాయిలైనా, అమ్మాయిలైనా మీ క్రష్ ఎవరు అని అడగ్గానే..ఏదో ఒక హీరోహిరోయిన్ పేరు చెప్పడం కామన్. అంతకు లేదంటే భార్య అయితే భర్త, భర్తయితే భార్య పేరు చెప్పడం జరుగుతుంది. కానీ భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా క్రష్.. ఓ గుర్రమట. ఈ విషయాన్ని అతడే తెలిపాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పాల్గొన్నజడేజా.. నెలరోజుల పాటు మ్యాచులు లేకపోవడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ సమయాన్ని తనకు ఇష్టమైన గుర్రాలతో గడుపుతున్నాడు. తాజాగా అతడు అందమైన ఓ నల్ల గుర్రం ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి "ఫారెవర్ క్రష్" అని రెడ్ హార్ట్ ఎమోజి కూడా జతచేశాడు.
Forever crush ❤️? #meetingafterlongtime pic.twitter.com/NvrvZrqenV
— Ravindrasinh jadeja (@imjadeja) June 18, 2023
జడేజా తన గుర్రంతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది జూన్‌లో కూడా ఇదే తరహాలో 'టు ఇండియన్ మేల్' అంటూ ఫోటోలను షేర్ చేశాడు. అలాగే జడేజాకు గుర్రపు స్వారీ అన్నా చాలా ఇష్టం. గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోలను కూడా అప్పుడుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు.
Two Indian male??#strongpersonality pic.twitter.com/01eN7Zdjbd
— Ravindrasinh jadeja (@imjadeja) June 3, 2022
?❤️? pic.twitter.com/dRdyie1nNr
— Ravindrasinh jadeja (@imjadeja) January 28, 2022