ముంబై: టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవిత చరిత్రను సినిమాగా మల్చబోతున్నారు. ఈ మేరకు అతనిపై బయోపిక్‌ను నిర్మిస్తున్నట్లు టీ సిరీస్ మంగళవారం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఆ బయోపిక్‌కు ఎలాంటి పేరును ఖరారు చేయలేదు. అలాగే యువరాజ్ పాత్రలో ఎవరు నటిస్తారన్న అంశంతో పాటు దర్శకుడు, నటీనటుల వివరాలను నిర్మాతలు ఇంకా వెల్లడించలేదు.
యువీ జీవితంలో జరిగిన ముఖ్యాంశాలు, స్ఫూర్తిదాయక మైన ఇన్నింగ్స్‌లు, వీరోచిత పోరాటాలు, క్యాన్సర్‌ను ఎదుర్కోవడం వంటి ప్రధాన అంశాలు ఇందులో ఉంటాయని నిర్మాతలు భూష ణ్ కుమార్, రవిభాగ్ చందక్ వెల్లడించారు. 13 ఏళ్ల వయసులో క్రికెట్ మొదలుపెట్టిన యువీ.. తన జీవితంలో ఎదురైన అడ్డంకులను ఎలా అధిగమించాడనే ప్రధాన కథాంశంతో ఈ బయోపిక్ తీస్తున్నామన్నారు. తనపై బయోపిక్ వస్తున్నందుకు చాలా సంతోషంగా, గౌరవంగా ఉందని యువీ అన్నాడు. ఇప్పటికే సచిన్, ధోనీ వంటి క్రికెటర్ల బయోపిక్స్ వెండి తెరపై సందడి చేశాయి.
Yuvraj Singh's biopic movie story breakdown.
— Satyam (@iamsatypandey) August 20, 2024
Chapter 1: Movie begins with Yuvi's cancer reports getting positive just before he is getting ready to play the world cup and cut to 1970s when Yograj Singh didn't made big into cricket and now wanted to make his son a cricketer,… pic.twitter.com/EYxC4ZnApG