IND vs SL ODI: రికార్డులన్నీ మనోళ్లవే.. శ్రీలంకపై భారత ఆటగాళ్లదే ఆధిపత్యం

IND vs SL ODI: రికార్డులన్నీ మనోళ్లవే.. శ్రీలంకపై భారత ఆటగాళ్లదే ఆధిపత్యం

శ్రీలంక అంటే భారత ఆటగాళ్లకు ఎక్కడ లేని పూనకం వస్తుంది. ఆ జట్టుపై సిరీస్ అంటే రికార్డుల మోత మోగిస్తారు. భారత ఆటగాళ్లందరికీ లంకపై ఘనమైన రికార్డ్ ఉంది. టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన టీమిండియా  వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యింది. మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా శుక్రవారం(ఆగస్ట్ 2) ఇరుజట్ల మధ్య తొలి పోరు జరగనుంది. కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తొలి సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విజయవంతంగా ముగించిన గౌతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గంభీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పుడు వన్డే ప్లేయర్లపై దృష్టి పెట్టాడు. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ సిరీస్ కు ముందు శ్రీలంకపై మన ఆటగాళ్ల రికార్డ్స్ ఒకసారి చేసేద్దాం. 

శ్రీలంకపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నిలిచారు. సచిన్ 80 ఇన్నింగ్స్ లో 3113 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 51 ఇన్నింగ్స్ లో 2594 పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచారు. కోహ్లీ ఈ సిరీస్ లో 520 పరుగులు చేస్తే సచిన్ ను అధిగమిస్తాడు. శ్రీలంకపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. వన్డేల్లో లంకపై విరాట్ ఏకంగా 10 సెంచరీలు బాదేశాడు. అత్యధిక  హాఫ్ సెంచరీల విషయానికి వస్తే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (19) టాప్ లో ఉన్నాడు. 

శ్రీలంకపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ రోహిత్ శర్మ చేశారు. 2013 లో ముంబై వేదికగా హిట్ మ్యాన్ ఈ ఘనత సాధించాడు. రోహిత్ శర్మ మొత్తం మూడు డబుల్ సెంచరీల్లో రెండు శ్రీలంకపైనే రావడం విశేషం. 303 ఫోర్లతో సచిన్ టెండూల్కర్ అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ వన్డేల్లో 183 పరుగులు చేసింది శ్రీలంకపైనే కావడం విశేషం. మూడు వన్డేల సిరీస్ లో మరి కొన్ని ఆల్ టైం రికార్డ్స్ బ్రేక్ చేస్తారేమో చూడాలి.