న్యూయార్క్ : రెండు నెలల పాటు ఐపీఎల్‌తో బిజీగా గడిపిన ఇండియా క్రికెటర్లు ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌పై దృష్టి పెట్టారు. మెగా టోర్నీ కోసం ఇప్పటికే అమెరికా చేరుకున్న టీమిండియా బుధవారం ట్రెయినింగ్ షురూ చేసింది. ఉదయం పదిన్నరకు గ్రౌండ్‌లోకి వచ్చిన 14 మంది ప్లేయర్లు తేలికపాటి జాగింగ్, షటిల్, రన్నింగ్, ఫుట్‌వాలీతో గడిపారు. ఇండియాతో పోలిస్తే ఇక్కడ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంది.
అలాగే చల్లని గాలి కూడా వీస్తుండటంతో వాతావరణం ఆహ్లాదకరంగా కనిపించింది. అయితే ఫ్లడ్ లైట్ల వెలుతురులో క్రికెట్ ఆడిన ప్లేయర్లందరూ ఇప్పుడు తెల్ల బాల్స్‌తో మార్నింగ్ సెషన్‌లో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. దీంతో ఈ పరిస్థితులకు అలవాటు పడేందుకు టీమిండియా సన్నాహకాలు మొదలుపెట్టింది. వ్యక్తిగత పని మీద ఇండియాలో నే ఉన్న విరాట్ శుక్రవారం టీమ్‌తో కలవనున్నాడు.