ప్రస్తుతం టీమిండియాకు మ్యాచ్ లు ఏమీ లేకపోవడంతో భారత క్రికెట్ అభిమానుల దృష్టి దేశవాళీ ప్రతిష్టాత్మక ట్రోఫీ అయినటువంటి దులీప్ ట్రోఫీపై నెలకొంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, అశ్విన్, జడేనా లాంటి స్టార్ ఆటగాళ్లను మినహాయిస్తే మిగిలిన భారత క్రికెటర్లందరూ ఈ ట్రోఫీ ఆడబోతున్నారు. గురువారం (సెప్టెంబర్ 5) అనంతపురం వేదికగా ఈ టోర్నీ జరగనుంది. తెలుగు రాష్ట్రంలో ఈ టోర్నీ జరగనుండడంతో ఇక్కడ సందడి వాతావరణం ఏర్పడింది.
భారత క్రికెటర్లు దులీప్ ట్రోఫీ ఆడడానికి సోమవారం (సెప్టెంబర్ 2) అనంతపురానికి చేరుకున్నారు. సోమవారం రాత్రి వీరు నగరానికి చేరుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ లాంటి అంతర్జాతీయ భారత క్రికెటర్లు ఉండడంతో సిటీ అంతా కోలాహలంగా మారింది. ఈ టోర్నీలో మొత్తం 6 మ్యాచ్ లు జరుగుతాయి. వాటిలో 5 మ్యాచ్ లు అనంతపురంలోనే జరుగనున్నాయి. ఆర్డీటీ స్టేడియంలో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. ఈ దేశీవాళీ టోర్నీ సెప్టెంబర్ 5 నుంచి 24వ తేదీ వరకు జరుగనుంది.
దులీప్ ట్రోఫీ కోసం బీసీసీఐ బుధవారం (ఆగస్ట్ 14) జట్లను ప్రకటించింది. రాబోయే ఎడిషన్ కోసం నాలుగు స్క్వాడ్ లను ఎంపిక చేసింది. టీమ్ ఏ, టీం బి, టీమ్ సి, టీం డి జట్లకు వరుసగా శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్లుగా జట్టును నడిపిస్తారు. దులీప్ ట్రోఫీ నుంచి రెస్ట్ తీసుకున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ నేరుగా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉంటారు.
Ruturaj Gaikwad, Shreyas Iyer, Arshdeep Singh & Axar Patel has arrived in Anantapur for the Duleep Trophy. ❤️😇🇮🇳 pic.twitter.com/iz5q6X1nnn
— Sports with naveen (@sportswnaveen) September 3, 2024