Team India: స్వదేశానికి భారత క్రికెటర్లు.. ఇంటికి వెళ్లకుండా చెన్నై జట్టులో చేరిన ఆల్ రౌండర్

Team India: స్వదేశానికి భారత క్రికెటర్లు.. ఇంటికి వెళ్లకుండా చెన్నై జట్టులో చేరిన ఆల్ రౌండర్

దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ పై ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక భారత క్రికెటర్లు స్వదేశానికి చేరుకున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత క్రికెటర్లు ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ఎవరి స్వస్థలాలకు వారు చేరుకున్నారు.సోమవారం(మార్చి 10) దుబాయ్ నుండి కుటుంబ సభ్యులతో ఉన్న ఆటగాళ్లందరూ బయలుదేరారు. అని బీసీసీఐ వర్గాలు తెలిపినట్టు సమాచారం.

రవీంద్ర జడేజా సోమవారం(మార్చి 10) చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో చేరాడు. అతను ఇంటికి వెళ్లకుండా నేరుగా సూపర్ కింగ్స్ జట్టుతో కలవడం విశేషం. చెన్నై చేరుకున్న తర్వాత జడేజా 'పుష్ప' శైలిలో జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. మంగళవారం (మార్చి 11) ఉదయం జడేజా వచ్చిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసింది

ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, పేసర్ హర్షిత్ రాణా సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం నుండి జట్టు తిరిగి వచ్చిన వెంటనే విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మతో కలిసి జట్టు హోటల్ నుండి బయలుదేరాడు.  పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రేయాస్ అయ్యర్ మార్చి 16న జట్టులో చేరనున్నాడు. 

Also Read :- ఫస్ట్ హాఫ్ మ్యాచ్‌లకు రూ.11 కోట్ల యువ పేసర్ దూరం

గత ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత గ్రాండ్ గా టీమిండియా విజయోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియాలో గ్రాండ్ గా పరేడ్ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చిన తర్వాత ఆటగాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిశారు. ఆ తర్వాత బస్ పరేడ్ వేడుకలు నిర్వహించారు. అయితే ఈ సారి ఐపీఎల్ ఉండడంతో ఆటగాళ్లకు రెస్ట్ కలిపించాలనే ఉద్దేశ్యంతో బీసీసీఐ ఎలాంటి వేడుకలు నిర్వహించడం లేదు. 

మార్చి 22న ఐపీఎల్ ప్రారంభం కావడంతో ఆటగాళ్లకు అలసిపోకుండా ఉండడానికి ఇండియాలో ఎలాంటి వేడుకలు నిర్వహించట్లేదట. ప్లేయర్లందరూ రెస్ట్ తీసుకొని ఆయా ఫ్రాంచైజీల దగ్గరకు చేరడానికి స్వల్ప విరామం అవసరమని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం.