Jitesh Sharma: చిన్ననాటి స్నేహితురాలితో భారత క్రికెటర్ నిశ్చితార్థం

భారత వికెట్ కీపర్ బ్యాటర్, పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్ జితేష్ శర్మ వివాహ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు. శుక్రవారం(ఆగష్టు 08) ఈ యువ క్రికెటర్ తన చిన్ననాటి స్నేహితురాలు శలక మకేశ్వర్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశాడు.

క్లబ్‌కు స్వాగతం.. రుతురాజ్

కొత్త జంటకు భారత క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు. జితేష్ - మకేశ్వర్‌ నిశ్చితార్థ పోస్టుపై రుతురాజ్ గైక్వాడ్ ఫన్నీగా స్పందించాడు. "అభినందనలు, క్లబ్‌కు స్వాగతం " అని రాసుకొచ్చాడు. 

జితేష్ శర్మ క్రికెట్ కెరీర్

జితేష్ శర్మ క్రికెట్ కెరీర్ విషయానికొస్తే, ఇతను గతేడాది చైనా వేదికగా జరిగిన ఆసియా క్రీడల ద్వారా భారత జట్టు తరుపున అరంగ్రేటం చేశాడు. నేపాల్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో జితేష్ 4 బంతుల్లో 5 పరుగులు చేశాడు. అనంతరం ఈ ఏడాది జనవరిలో ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్‌ తరఫున తన చివరి టీ20 మ్యాచ్‌ ఆడాడు. ఇప్పటివరకూ 9 టీ20 మ్యాచ్‌ల్లో147.06 స్ట్రైక్ రేట్‌తో 100 పరుగులు చేశాడు. ఇక, ఐపీఎల్‌లో అతను పంజాబ్ కింగ్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. ఇప్పటివరకూ 40 మ్యాచ్‌ల్లో 151.14 స్ట్రైక్ రేట్‌తో 730 పరుగులు చేశాడు.