న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ) వేదికగా జమ్మూకాశ్మీర్‌పై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన కామెంట్లకు అదే వేదికగా భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది.
పాలస్తీనాలో మాదిరిగా జమ్మూ ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని, ఆర్టికల్ 370 రద్దు చేయడం హేయమైన చర్య అంటూ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను ఇండియా దౌత్యవేత్త భవికా మంగళానందన్ తీవ్రంగా తప్పుబట్టారు.
యూఎన్‌లో ఆమె మాట్లాడుతూ.. మిలిటరీ సహకారంతో నడుస్తూ, టెర్రరిజాన్ని ఇతర దేశాలపైకి ఉసిగొల్పే ఓ దేశం ప్రపంచ వేదికలపై ఇండియా మీద విషం వెళ్లగక్కుతున్నదని మండిపడ్డారు.