అమెరికా వాషింగ్ టన్ డీసీలోని ఇండియన్ ఎంబసీకి చెందిన ఆఫీసర్ అనుమానస్పదంగా మృతి చెందారు. సెప్టెంబర్ 18 సాయంత్రం సదరు అధికారి చనిపోయినట్లు భారతీయ దౌత్య కార్యాలయం అధికారికంగా (సెప్టెంబర్ 20)న శుక్రవారం ప్రకటించింది. అతని మరణానికి కారణాలు ఇంకా తెలియదు. వాషింగ్ టన్ డీసీలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయంలో అతను విధులు నిర్వహిస్తున్నాడు.
లా ఎన్‌ఫోర్స్‌మెంట్, యుఎస్ సీక్రెట్ సర్వీస్ రెండింటి ద్వారా విచారణ జరుగుతుంది. అధికారి ఉరివేసుకుని చనిపోయాడని ప్రాథమికంగా డాక్టర్లు చెప్తున్నారు. గోప్యత కారణంగా చనిపోయిన వ్యక్తి వివరాలు, గుర్తింపు బయట పెట్టలేదు ఇండియన్ ఎంబసీ. ‘ఇండియన్ ఎంబసీకి చెందిన ఒక వ్యక్తి 2024 సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం మరణించారని విచారంతో తెలియజేస్తున్నాము. అధికారి మృతదేహాన్ని త్వరగా భారతదేశానికి తీసుకెళ్లడానికి అన్ని సంబంధిత అధికారులు, కుటుంబ సభ్యులతో మాకు సంప్రదింపులు జరుగుతున్నాయి.’ అని ఇండియన్ ఎంబసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Sad news from Indian mission in United States. Indian Embassy official found dead at Washington DC office under mysterious circumstances. Investigations are underway. pic.twitter.com/0NOxfTO4aG
— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 20, 2024