ఉగాండాలో జనగామ వాసి హత్య

ఉగాండాలో జనగామ వాసి హత్య
  • తాగిన మైకంలో కాల్చి చంపిన సెక్యూరిటీ గార్డు 

జనగామ, వెలుగు: జనగామ జిల్లా కేంద్రంలోని గిర్నిగడ్డకు చెందిన ఇటుకాల తిరుమలేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (41) ఉగాండాలో హత్యకు గురయ్యాడు. తాగిన మైకంలో సెక్యూరిటీ గార్డు కాల్చడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గిర్నిగడ్డకు చెందిన ఇటుకాల కిష్టమ్మ, కిష్టయ్య దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కొడుకైన తిరుమలేశ్‌‌‌‌‌‌‌‌ ఉగాండా దేశంలోని కంపాలలో ఉన్న రాయల్‌‌‌‌‌‌‌‌ టెక్‌‌‌‌‌‌‌‌ ప్రాపర్టీస్‌‌‌‌‌‌‌‌ కంపెనీలో ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. 2016లో ఉగాండాకు వెళ్లిన తిరుమలేశ్‌‌‌‌‌‌‌‌ రెండేళ్ల తర్వాత ఇండియాకు వచ్చి కొంతకాలం మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథలో పనిచేశాడు. 

16 నెలల క్రితమే భార్య సునీత, కుమారుడు వరుణ్‌‌‌‌‌‌‌‌తో కలిసి తిరిగి ఉగాండా వెళ్లాడు. కుమార్తె అఖిలను మాత్రం నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లోని అమ్మమ్మ ఇంటిలో ఉంచి చదివిస్తున్నారు. సైట్‌‌‌‌‌‌‌‌ చూసేందుకు తిరుమలేశ్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం ఉదయం తన కంపెనీకే చెందిన నమ్మసాలకు వెళ్లాడు. పనులను పరిశీలించిన అనంతరం ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఉండగా అక్కడే డ్యూటీ చేస్తున్న సెక్యూరిటీ గార్డు‌‌‌‌‌‌‌ తన గన్‌‌‌‌‌‌‌‌తో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో భయాందోళనకు గురైన సహచర ఉద్యోగులు ఎవరూ బయటకు రాలేదు. కొంతసేపటి తర్వాత ఏం జరిగిందో తెలుసుకునేందుకు తిరుమలేశ్‌‌‌‌‌‌‌‌ బయటకు రావడంతో సెక్యూరిటీ గార్డు‌‌‌‌‌‌‌ గన్‌‌‌‌‌‌‌‌తో షూట్‌‌‌‌‌‌‌‌ చేయగా అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత సెక్యూరిటీ గార్డు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత జనగామలోని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తండ్రి కిష్టయ్య సైతం ఇంజనీర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తూ కరోనా టైంలో చనిపోయాడు.

డెడ్‌‌‌‌‌‌‌‌బాడీ తరలింపునకు ఇబ్బందులు

ఉగాండాలో హత్యకు గురైన తిరుమలేశ్‌‌‌‌‌‌‌‌ డెడ్‌‌‌‌‌‌‌‌బాడీని జనగామకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శని, ఆదివారాలు ఉగాండాలో సెలవు రోజులుగా కావడంతో డెడ్‌‌‌‌‌‌‌‌బాడీ తరలింపునకు ఇక్కట్లు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. డెడ్‌‌‌‌‌‌‌‌బాడీ జనగామకు వచ్చేందుకు టైం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం స్పందించి తిరుమలేశ్‌‌‌‌‌‌‌‌ డెడ్‌‌‌‌‌‌‌‌బాడీని జనగామకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.