కెనడాలో ఇండియన్​ ఫ్యామిలీ మృత్యువాత

టొరంటో: కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా నదిలో పడవ బోల్తా పడటంతో ఒక ఇండియన్ ఫ్యామిలీ, ఒక రొమేనియన్ ఫ్యామిలీకి చెందిన 8 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఆరుగురు పెద్దవారు, ఇద్దరు మూడేండ్లలోపు చిన్నారులు ఉన్నారు. సెయింట్ లారెన్స్ నది మీదుగా బుధవారం రాత్రిపూట పడవపై అమెరికా వైపు ప్రయాణం చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు కెనడా అధికారులు వెల్లడించారు. 

సెయింట్ లారెన్స్ వెట్ ల్యాండ్స్ వద్ద గురువారం ఆరు, శుక్రవారం రెండు డెడ్ బాడీలను గుర్తించినట్లు తెలిపారు. చనిపోయిన ఇద్దరు చిన్నారులకు కెనడా సిటిజన్​షిప్ కూడా ఉన్నట్లు చెప్పారు. గల్లంతు అయిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.