Champions Trophy 2025: వక్రబుద్ధి చాటుకున్న పాక్.. కరాచీ స్టేడియంలో ఎగరని భారత జెండా

Champions Trophy 2025: వక్రబుద్ధి చాటుకున్న పాక్.. కరాచీ స్టేడియంలో ఎగరని భారత జెండా

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విమర్శలకు గురవుతుంది. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు కరాచీలోని నేషనల్ స్టేడియంలో భారత జెండా కనిపించలేదు. ఏడు దేశాల జాతీయ జెండాలు కనిపించినా భారత జెండా మాత్రం ఎగర వేయడానికి  పాక్ క్రికెట్ బోర్డు నిరాకరించినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. భారత త్రివర్ణ పతాకం కనిపించకపోవడం టీమిండియా అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోసిల్ మీడియాలో తీవ్ర చర్చకు గురి చేస్తుంది. పాక్ బోర్డుపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.    

భారత జెండా లేకపోవడం వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా తెలియకపోయినా.. టీమిండియా పాకిస్తాన్‌లో తన మ్యాచ్‌లు ఆడకపోవడమే దీనికి కారణమని తెలుస్తుంది. రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా సమస్యల కారణంగా  బీసీసీఐ హైబ్రిడ్ మోడల్‌లో మ్యాచ్ లు ఆడనుంది. ఈ మోడల్ ప్రకారం భారత్ తమ అన్ని మ్యాచ్ లు దుబాయ్ వేదికగా ఆడుతుంది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా,  ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు మ్యాచ్ లు ఆడనున్నాయి. కొన్ని రోజుల క్రితం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవ వేడుక కార్యక్రమంలోనూ భారత జెండాను  కాకుండా మిగిలిన ఏడు దేశాల జెండాలను ఎగరవేశారు. అప్పట్లో ఈ వీడియో వైరల్ అయింది. 

ALSO READ | Pakistan Cricket: పాకిస్థాన్ దేశమూ, వారి జట్టు రెండూ ఒక్కటే.. అందరిదీ ఒకే రేఖ: భారత మాజీ సెటైర్లు

2017 తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది. ఫిబ్రవరి 19 న తొలి మ్యాచ్ లో ఆతిధ్య పాకిస్థాన్ తో న్యూజిలాండ్ తలపడుతుంది. కరాచీ నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.  

పాకిస్తాన్‌,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత జట్టు పాల్గొనే మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ గ్రూప్ ఏ లో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బి లో ఉన్నాయి.