భారత ఫుట్ బాల్ ప్లేయర్ భూపిందర్ సింగ్ రావత్ అనారోగ్యంతో చనిపోయారు. అతడు మరణించినట్టు ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) దృవీకరించింది. భూపిందర్ సింగ్ రావత్ భారత ఫుట్ బాల్ మిడ్ ఫీల్డర్. 1969లో మలేషియాలో జరిగిన మెర్డెకా కప్‌లో ఆయన ఆడారు. ప్రస్తుతం అతనికి 85 ఏళ్లు. ఇతనికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
భూపీందర్ సింగ్ రావత్ ఒక క్లాస్సి వింగర్. అతను భారత ఫుట్ బాల్ కు విశిష్ట సేవలందించాడు. బంతిని డిఫెన్స్ చేయడంలో ఈయన సిద్ధహస్తుడు. అభిమానులు రావత్ ను "స్కూటర్" అని ముద్దుగా పేరు పెట్టారు. అతని కుటంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని AIFF అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే తన సంతాపాన్ని తెలిపారు. దేశీయ ఫుట్‌బాల్‌లో అతను ఢిల్లీ గారిసన్, గూర్ఖా బ్రిగేడ్, మఫత్‌లాల్ వంటి అగ్రశ్రేణి జట్లకు ఆడాడు. సంతోష్ ట్రోఫీ కోసం నేషనల్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో సర్వీసెస్, మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు.