
పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో ఒకే ఓవర్ లో 6 బంతులకి 6 సిక్సర్లు కొట్టిన భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గురించి దాదాపుగా తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు. అయితే యువరాజ్ సింగ్ కేవలం క్రికెట్ పరంగా మాత్రమే కాదు ప్రమాదకర క్యాన్సర్ ని సైతం జయించి ఎంతోమంది క్యాన్సర్ పేషేంట్లకి ఆదర్శంగా నిలిచాడు. అయితే తాజాగా యువరాజ్ సింగ్ అప్పట్లో ఓ బాలీవడ్ ప్రముఖ హీరోయిన్ తో జరిగిన డేటింగ్ గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో భాగంగా 2007 వ సంవత్సరంలో ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళినప్పుడు సరిగ్గా అదే సమయంలో బాలీవడ్ కి చెందిన ప్రముఖ హీరోయిన్ కూడా షూటింగ్ నిమిత్తమై ఆస్ట్రేలియాలో కలిసిందని చెప్పుకొచ్చాడు. అయితే రెండు టెస్టులు ఆడిన తర్వాత తనని కలవాలని హీరోయిన్ కోరిందని దాంతో తాను ఆమెని కలిసి మాట్లాడానని ఈ క్రమంలో కెరీర్ గురించి మాట్లాడుకున్నామని తెలిపాడు.
ALSO READ | విడాకుల కోసం కోర్టుకెళ్లిన మరో స్టార్ నటి...
అయితే ఉదయం ఎయిర్ పోర్ట్ కి బయలుదేరే సమయంలో హీరోయిన్ ఏకంగా తన షూస్ ని సూట్ కేసులో దాచి ఉంచిందని దీంతో బస్ కి సమయం అవుతుందని టెన్షన్ పడుతుంటే ఆ హీరోయిన్ తన షూస్ ఇచ్చి కొత్తవి కొనేవరకూ ఇవి ఉపయోగించమని చెప్పిందని నవ్వుతూ చెప్పాడు.
ఆ సమయంలో తనకి హీరోయిన్ షూస్ తీసుకోవడం ఇష్టం లేకపోయినప్పటికీ అయిష్టంగానే ఆమె ఇచ్చిన షూస్ ధరించి ఎయిర్ పోర్ట్ కి వెళ్లానని తెలిపాడు. అయితే తనతో డేటింగ్ కి వెళ్లిన హీరోయిన్ పేరు యువరాజ్ సింగ్ చెప్పలేదు.